పార్వతీ మాత పసుపు నలుగుపిండితో శ్రీ విఘ్నేశ్వరుని ప్రతిమ చేసి ప్రాణం పోస్తుంది. గణనాధుని జననం అన్ని గణాలకు అధిపతియై ఎలాంటి తీర్పునైనా పక్షపాతంగా చెప్పాలనే సంకల్పంతో జరిగింది. మాత ప్రాణం పోసింది కాబట్టి.. ఎప్పుడైనా తీర్పు చెప్పే ముందు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు చెప్పాల్సి వస్తుందని, తీర్పుని ఆలోచించే శక్తి శిరస్సుకు ఉంటుందని గ్రహించిన శివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. అనంతరం ఏనుగు ముఖంతో ప్రాణం పోసుకుని అన్ని గణాలకు అధిపతియై గణపతిగా పూజలందుకుంటాడు. సృష్టి శ్రేయస్సు కోసం పుత్రుని శిరస్సు ఖండించిన శివున్ని దేవునిగా కొలిసే భూమి భారత భూమి. జై భారత్..!!