“ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్” వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బజరంగ్ పునియా
ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పునియాకు కాంగ్రెస్ కీలక పదవిని కట్టబెట్టింది. ‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు ఆప్‌తో పొత్తు గురించి కాంగ్రెస్ చర్చిస్తోంది. వీరిద్దరి చేరిక ఆప్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.