“ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్” వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బజరంగ్ పునియా

51చూసినవారు
“ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్” వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బజరంగ్ పునియా
ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పునియాకు కాంగ్రెస్ కీలక పదవిని కట్టబెట్టింది. ‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు ఆప్‌తో పొత్తు గురించి కాంగ్రెస్ చర్చిస్తోంది. వీరిద్దరి చేరిక ఆప్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్