చిత్తూరు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

80చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ తెలిపారు. మిట్టూరులోని కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దీపావళికి సీఎం మహిళలకు ఉచిత సిలిండర్, ఉచిత బస్సు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వీటిపై ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్