ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామకుప్పం తహసిల్దార్, ఎంపిడివోలు మండలంలోని అధికారులను మంగళవారం ఆదేశించారు. ఎంపిడివో కార్యాలయం, సచివాలయాలలో ఎల్ ఈ డీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని చూసేలా చర్యలు తీసుకున్నట్లు తహసిల్దార్ శ్రీధర్ వెల్లడించారు.