

కుప్పం: కుప్పాన్ని కమ్మేసిన మంచు
కుప్పం నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజాము నుంచి మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 8 గంటల దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించవలసి వచ్చింది. పాఠశాలలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు మంచు కారణంగా చలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.