ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానం అత్యవసరంగా లండన్‌లో ల్యాండ్ అయింది. ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఆ విమానాన్ని లండన్‌కు దారి మళ్లించినట్లు విమానయాన సంస్థ వర్గాలు వెల్లడించాయి. లండన్ కాలమాన ప్రకారం, ఉదయం 7 గంటలకు ఆ విమానాన్ని దారి మళ్లించినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.