నకిలీ బంగారంతో బురిడీ కొట్టించిన ఘటన చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. తక్కువ ధరకే గోల్డ్ ఇస్తామని స్థానికంగా ఉంటున్న పూజారి సుబ్రహ్మణ్యాన్ని రమేశ్ అనే వ్యక్తి కలిశాడు. ఈ మేరకు రూ. 5 లక్షలకు మూడున్నర కేజీల నకిలీ బంగారాన్ని ఇచ్చాడు. కొంత బంగారాన్ని అమ్మేందుకు పూజారి గురువారం ప్రయత్నించగా నకిలీ బంగారమని తేలింది. బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ అనిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.