పంచాయతీ సిబ్బందికి పండుగ కానుకలు
మంచి పై చెడుకు ప్రతీక దీపావళి, చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక, జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ అన్నారు. ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందామన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం పుదిపట్ల పంచాయతీ సిబ్బందికి టపాకాయలు, స్వీట్స్ పంపిణీ చేశారు.