బంగారు తిరుచ్చి పై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి

62చూసినవారు
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి శనివారం సాయంత్రం తిరుచ్చి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి అనంతరం శాస్త్రోక్తంగా నిత్య కైంకర్య సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరించగా భక్తులు పెద్ద సంఖ్యలో కర్పూర నీరాజనాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్