Feb 10, 2025, 08:02 IST/రామగుండం
రామగుండం
పెద్దపల్లి: భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించాలి: కలెక్టర్
Feb 10, 2025, 08:02 IST
భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో భూగర్భ జలాల సంచార నాణ్యత ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించారు. భూగర్భ జలాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద భూగర్భ జలాల నాణ్యత విశ్లేషణ కోసం సంచార నాణ్యత ప్రయోగశాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జలాల అధికారి లావణ్య పాల్గొన్నారు.