వివేకా హత్య కేసు.. ఈ నెల 27కు విచారణ వాయిదా

65చూసినవారు
వివేకా హత్య కేసు.. ఈ నెల 27కు విచారణ వాయిదా
TG: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని CBI సాక్షిగా పరిగణించడంపై హైకోర్టులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ, దస్తగిరికి నోటీసులు ఇచ్చింది. ఈనెల 27కు తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, దస్తగిరి కౌంటర్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్