Sep 27, 2024, 06:09 IST/వేములవాడ
వేములవాడ
దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి
Sep 27, 2024, 06:09 IST
రానున్న బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలోని గెస్ట్ హౌస్ లో గురువారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.