TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఎస్ఐ పై ఓ ప్రేమ జంట సంచలన ఆరోపణలు చేసింది. దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన ప్రేమ జంట ఓ వీడియో విడుదల చేసింది. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని, అయితే అమ్మాయి తల్లిదండ్రులు, ఎస్ఐ సందీప్‌తో కలిసి తమను విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ యువ జంట పేర్కొంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.