చంద్రగిరి: ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
పాకాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ మొగిలీశ్వర్ రెడ్డిలు క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ చేస్తూ ఎస్పీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఒక రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించి, ముద్దాయి పేరును తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు విచారణలో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.