పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

973చూసినవారు
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. స్థానిక యం. డి. హెచ్ ఫౌండేషన్ అధినేత, వైకాపా యువనాయకులు యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వి. కోట మండలం గాండ్లపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలలో మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ చేతుల మీదగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంను ఉద్దేశించి విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పచ్చని చెట్లు సృష్టిలో ఉన్న ప్రతి జీవ రాశికి అత్యవసరమని అటువంటి అమూల్యమైన సంపద చెట్లని తెలియజేస్తూ వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేయసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యశోద, జగన్నాధం, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you