TG: కరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించిన ఘటన హైదరాబాద్‌లో నెలకొంది. లంగర్ హౌస్ – బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో బీజేపీ నాయకుడు గడ్డి చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులోనే పూర్తి చేశారు. శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.