Feb 15, 2025, 09:02 IST/
VIDEO: కింగ్ ఫిషర్ బీరులో ఫంగస్
Feb 15, 2025, 09:02 IST
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన విషయం తెలిసిందే. ధరల పెంపుపై మద్యం ప్రియులు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జనగామ జిల్లా దేవరుప్పులలో షాకింగ్ ఘటన జరిగింది. కింగ్ ఫిషర్ బీరు తీసుకున్న ఓ వ్యక్తి అందులో ఫంగస్‌ను గుర్తించాడు. ధరలు పెంచి, కల్తీ బీర్లు సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియుల ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.