పూతలపట్టు: శ్రీక్రిష్ణ భజన మందిరంలో విశేష పూజలు
చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, ముత్తుకూరు పల్లి గ్రామంలో వున్న శ్రీకృష్ణ భజన మందిరంలో బుధవారం నాడు విశేష పూజా కార్యక్రమం జరిపారు. ఆలయ అర్చకులు చంద్రాచారి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ భగవానుని చిత్రపటాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. గ్రామస్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.