
పూతలపట్టు: వేరుశనగ పంట పై శిక్షణ
తవణంపల్లె మండలంలోని చెర్లోపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 30 మంది ఎస్సీ రైతులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ సీడ్ పథకం కింద వేరుశనగ పంటపై పలు సూచనలు చేశారు. చిత్తూరు ఏరువాక శాస్త్రవేత్త సంధ్యా రాణి మాట్లాడుతూ, వేరుశనగలు పంటలో మేలైన, వివిధ రకాల రోగాలను తట్టుకొనే కొత్త రకాల విత్తనాల గురించి వివరించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.