

తవణంపల్లి: అదుపుతప్పి కాలువలో పడిన లారీ
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్న గురకల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. మైసూరు నుంచి వస్తున్న అల్లం లోడు లారీ జొన్న గురకల వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.