గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ

1549చూసినవారు
గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి లో సోమవారం గ్రామ సచివాలయ భవనం ,రైతు భరోసా, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాలకు నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

ప్రజల చెంతకే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు దత్తాత్రేయ రెడ్డి మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృపా సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు శ్రీనివాసులు ,ప్రకాష్ రెడ్డి , సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you