ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడం మన దేశ సంస్కృతి కాదని చాగంటి చెప్పారు. సంప్రదాయం ప్రకారం.. గ్రహాల కదలికను బట్టి సంవత్సరం నిర్ధారిస్తారని, అర్ధరాత్రి సంవత్సరం మారిందని పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మనకు అసలైన కొత్త సంవత్సరం ఉగాదేనని చెప్పారు.