డాక్టర్ బషీర్ తపస్య పాఠశాల ఆధ్వర్యంలో 2కె రన్

68చూసినవారు
డాక్టర్ బషీర్ తపస్య పాఠశాల ఆధ్వర్యంలో 2కె రన్
రేణిగుంట పట్టణంలోని డాక్టర్ బషీర్ తపస్య పాఠశాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 2కె రన్ ఘనంగా నిర్వహించారు. బుధవారం రేణిగుంట విమానాశ్రయ మార్గంలో తపస్య పాఠశాల కరస్పాండెంట్ విక్రం షాలి, ప్రధానోపాధ్యాయురాలు అనూష జండా ఊపి 2కె రన్ ప్రారంభించారు. జిల్లాలోని పలు పాఠశాల విద్యార్థులు
ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్