శ్రీకాళహస్తి: విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరి కొండ వద్ద విఘ్నేశ్వర స్వామికి సోమవారం మహా కుంభాభిషేకం వేడుకలు ఘనంగా జరిగాయి. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన, కలశ స్థాపన పూజ, పూర్ణాహుతి హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తి పారవశ్యంతో నిండింది.