తిరుపతి నగర పాలక సంస్థలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్. మౌర్య పాల్గొని అమ్మవారికి, నగరపాలక సంస్థ వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అందరూ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని అన్నారు.