
తిరుపతి: నక్షతో భూతగాదాలకు చెక్: ఎమ్మెల్యే ఆరణి
నక్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుపతిలో డ్రోన్ సర్వే ను ఆదివారం వినాయకసాగర్ లో జెండా ఊపి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ సర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిటరింగ్ ప్రొగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం నక్ష ప్రాజెక్ట్ కింద తిరుపతిని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.