వికసిత్ భారత్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ అన్నారు. రాబోయే 50 సంవత్సరాలు రైల్వే స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కాగా, తిరుపతి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం పరిశీలించింది.