Oct 24, 2024, 16:10 IST/
రివ్యూ కోసం రోహిత్ శర్మను బతిమలాడిన సర్ఫరాజ్ (వీడియో)
Oct 24, 2024, 16:10 IST
పూణేలో జరగుతున్న టెస్టులో ఆసక్తికర దృశ్యం కనిపించింది. న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగక్కు అశ్విన్ వేసిన బాల్ అతడి గ్లౌజ్ కు తాకుతూ పంత్ చేతిలో పడింది. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. రివ్యూ విషయంలో రోహిత్ సందేహిస్తుండగా నన్ను నమ్మి రివ్యూ తీసుకో ప్లీజ్ అన్నట్లుగా సర్ఫరాజ్ ఆయన్ను బతిమలాడారు. ఈ సన్నివేశం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. చివరికి రివ్యూ తీసుకోగా యంగ్ ఔటని తేలడంతో అశ్విన్‌కు వికెట్ దక్కింది.