AP: గన్నవరంలో వంగవీటి రంగా విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహాలు ఆవిష్కరించే విషయంపై ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక జనసేన కార్యకర్తలకు తెలియకుండా ఎందుకు నిర్వహిస్తున్నారు అంటూ కార్యకర్తలు నాయకులను నిలదీశారు. ఈ ఘర్షణలో పంచాయితీ కార్యదర్శిని మా పాలేరువి నువ్వు అని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.