ఫ్రూటీలు తాగి 30 మంది పిల్ల‌ల‌కు అస్వ‌స్థ‌త‌

50చూసినవారు
ఫ్రూటీలు తాగి 30 మంది పిల్ల‌ల‌కు అస్వ‌స్థ‌త‌
AP: రాజ‌మండ్రిలోని హుకుంపేట డీ మార్ట్‌లో ఆదివారం 80 ఫ్రూటీల‌ను స్థానిక చ‌ర్చి నిర్వాహ‌కులు కొనుగోలు చేశారు. ఆ ఫ్రూటీల‌ను చ‌ర్చి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పాఠ‌శాల విద్యార్థుల‌కు ఇచ్చారు. అవి తాగిన దాదాపు 30 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సోమ‌వారం విష‌యం వెలుగులోకి రావ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు, బంధువులు ఆందోళ‌న చేప‌ట్టారు. కాలం చెల్లిన ఫ్రూటీలు విక్ర‌యించార‌ని డీమార్ట్‌పై బొమ్మూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్