ఇజ్రాయెల్, హమాస్ మధ్య పరిస్థితులు శాంతించాయి. ఈ క్రమంలో యుద్ధం మొదట్లో ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఉత్తర గాజా నుంచి దక్షిణాదికి తరలిపోయిన పాలస్తీనా ప్రజలు తిరుగు ప్రయాణం అయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందం క్రమంలో లక్షలాది మంది ప్రజలు మొదటిసారి స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.