భారతీయులపై రొమ్ము క్యాన్సర్ ఆర్థిక భారాన్ని మోపుతోంది. క్యాన్సర్ కేసులు భారతదేశంలో గణనీయంగా పెరిగాయని, వార్షికంగా 5.6 శాతం పెరుగుదల నమోదవుతాయని ఇటీవల పరిశోధకులు వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్ ఆర్థికభారం 2030 నాటికి $13.96 బిలియన్లకు పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. చికిత్స కోసం సాధారణ ఖర్చు రూ.5 నుంచి 6 లక్షల మధ్య ఉంటుందని, ఆరు రౌండ్ల కీమోథెరపీకి రూ.20 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుందని తెలిపారు.