ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది. మెస్రం వంశీయులు మంగళవారం జాతర పూజలను ప్రారంభించారు. గంగా జలాన్ని, ఆలయ ప్రాంగణంలోని మురాడి వద్దకు మెస్రం వంశీయులు తీసుకొచ్చారు. గ్రామంలోని పాత ఆలయం నుంచి నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా గర్భగుడిలో భద్రపరిచారు. అర్ధరాత్రి 11:30 సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభం కానుంది.