AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి ఇక్కడికి వచ్చారు. సీఎం అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా పలుకరించారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు. సీఎంకు స్వాగతం పలుకుతూ పచ్చని తోరణాలు, భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.