AP: కడప జిల్లా ఆర్టీపీపీ ప్లైయాష్ తరలింపు వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి చేరింది. ఫ్లైయాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు వివాదంపై సీఎంవో జిల్లా అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై ఆయన ఫైర్ అయ్యారు. ఇరు పార్టీల నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.