AP: గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి.సాయికిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు బి.వంశీకృష్ణ, టి.వాణీ ప్రసన్న అభివృద్ధి చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ కాప్స్యూల్ వేసుకుంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి గుండెపోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.