ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత

71చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ కన్నుమూశారు. 112 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో 1912 ఆగస్టు 26న జన్మించిన టిన్నిస్‌వుడ్.. షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసి 1972లో ఉద్యోగ విరమణ పొందారు.

సంబంధిత పోస్ట్