పులి సంచారం.. స్థానికుల భయాందోళన

61చూసినవారు
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయిగాం సమీపంలోని జాతీయ రహదారి పక్కన పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారికి పక్కన పులి సంచరించిన వీడియోను ఓ లారీ డ్రైవర్ తన ఫోనులో చిత్రీకరించారు. డ్రైవర్ హారన్ కొట్టడంతో పులి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్