ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వానికి ఎర్రన్నల నుంచి రెడ్ సిగ్నల్ పడుతోంది. సీపీఐ, సీపీఎం అయితే సమయం వస్తే చాలు కూటమి ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటిదాకా పార్టీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడిన కామ్రేడ్స్ ఇప్పుడు కదన రంగంలోకి దిగుతున్నారు. ముందుగా సీపీఎం జనంలోకి వస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 1 నుంచి 8 వరకూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.