డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్‌ను క్రియేట్ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలన్నారు.