డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు: పవన్ కళ్యాణ్

71చూసినవారు
డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు: పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం అవుతానని తాను అనుకోలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన నాయకులతో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను పవన్ సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పదన్నారు. కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయమే కీలకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్