రాష్ట్ర స్థాయి అండర్-14, 17, 19 తైక్వాండో పోటీల్లో అంబాజీపేట క్రీడాకారులు వెండి పతకాలు గెలుచుకున్నారని జిల్లా కోచ్ పెట్టాలి త్రిమూర్తులు తెలిపారు. ఉన్నత పాఠశాలలో క్రీడాకారులను ఎస్ఐ చిరంజీవి గురువారం అభినందించారు. రైల్వేకోడూరులో జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ పోటీల్లో చైతన్య వెండి పతకం సాధించాడన్నారు. తిరుపతిలో జరిగిన అండర్-14, 17 విభాగాల్లో మౌనిక వెండి, రితిక్ కాంస్య పతకం సాధించారని తెలిపారు.