సీఎం ఇచ్చిన హామీలను పరిష్కరించాలి: జేసీ
ఆగస్టు 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగిన గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రజలకు సమస్యలపై ఇచ్చిన హామీలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె శాఖల వారీగా అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు.