మినీ జాబ్ మేళాలో 20 మంది ఎంపిక

54చూసినవారు
మినీ జాబ్ మేళాలో 20 మంది ఎంపిక
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ ఉద్యోగ మేళా గురువారం నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతి నిధులు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి ముఖాముఖి నిర్వహించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 86 మందికి మొదటి దశ ఇంటర్వ్యూ నిర్వహించి 23 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కొండలరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్