
రాజమండ్రి: జగన్ అంటే నమ్మకం - చంద్రబాబు అంటే మోసం
వైసీపీ అధినేత జగన్ అంటే నమ్మకం అని చంద్రబాబు అంటే మోసం అని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు & మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరులో జగన్ నమ్మకం- చంద్రబాబు మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను, హామీలను మర్చిపోయిందని ఆరోపించారు.