రాజోలు: జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి

69చూసినవారు
రాజోలు మండలం రాజోలు గ్యాస్ కంపెనీ రోడ్ చివర్లో ఉన్న జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యల పై స్పందించిన గ్రామ సర్పంచ్ రేవు జ్యోతి, ఉపసర్పంచ్ పామర్తి రమణ, జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ సూరిశెట్టి శ్రీను సోమవారం పరిశీలించారు. కాలనీలో రోడ్లు, విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్