ఆలమూరు: ఆక్రమణ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ఆక్రమణల చెరలో ఉన్న డి పట్టా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొత్తపేట నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య ఆలమూరు తహసిల్దార్ కేజే ప్రకాష్ బాబుకు విజ్ఞప్తి చేశారు. ఆలమూరు మండలం బడుగు వాని లంక పంచాయతీ వద్ద మంగళవారం జరిగిన రెవిన్యూ గ్రామ సభలోఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భూములను నదీపాతానికి గురై భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాలని కోరారు.