డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం ఎక్సైజ్ సర్కిల్ పోలీసు స్టేషన్ పరిధిలోనున్న 20 మద్యం దుకాణాలకు శుక్రవారం తుది గడువు ముగిసేసరికి 427 దరఖాస్తులు వచ్చాయి. దీంతో కేవలం ధరఖాస్తు ఫీజు ద్వారా రూ 8. 54 కోట్లు ఆదాయం లభించింది. ఆలమూరు లో(05)139, కపిలేశ్వరపురంలో(04)83, మండపేట రూరల్‌లో(06)123మండపేట పట్టణంలో (05) 82 ధరఖాస్తులు అందినట్లు సీఐ ఐడీ నాగేశ్వరరావు తెలిపారు.