ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రావులపాలెం రూరల్ సిఐ. సిహెచ్. విద్యాసాగర్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ సెంటర్ వద్ద సోమవారం వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై ఎం.అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలకు కట్టుబడినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.